SRH జెర్సీ ధరించిన టీమిండియా స్టార్ పేసర్ (PHOTO)

by Gantepaka Srikanth |
SRH జెర్సీ ధరించిన టీమిండియా స్టార్ పేసర్ (PHOTO)
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఐపీఎల్(IPL 2025) సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలెట్టాయి. ఛాంపియన్స్ ట్రోఫీ - 2025(Champions Trophy - 2025) సాధించిన మాంచి జోష్‌లో దేశానికి వచ్చిన.. టీమిండియా ప్లేయర్లంతా వారి వారి టీముల్లో చేరిపోయారు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) సైతం సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో కలిశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం(Uppal Ground)లో ప్రాక్టీస్ సైతం మొదలు పెట్టారు.

మరికొన్ని రోజుల్లో సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ జెర్సీ(SRH Jersey) ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన SRH ధరించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మార్చి 22వ తేదీ నుంచి 2025కు సంబంధించిన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో, రెండో మ్యాచ్ SRH, రాజస్థాన్ మధ్య ఉప్పల్‌లో, మూడో మ్యాచ్ సీఎస్‌కే, ముంబై మధ్య చెన్నైలో, నాలుగో మ్యాచ్ ఢిల్లీ, లక్నో మధ్య ఢిల్లీలో, ఐదో మ్యాచ్ గుజరాత్, పంజాబ్ మధ్య అహ్మదాబాద్‌లో జరుగనుంది.


Next Story