కంగారు పడిన ఆసీస్.. టీమిండియా ఘన విజయం

by GSrikanth |
కంగారు పడిన ఆసీస్.. టీమిండియా ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌ను కంగారు పెట్టి గెలుపొందింది. అయితే, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 188 పరుగుల స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్(81) మినహా.. ఎవరూ రాణించలేదు. దీంతో 189 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కూడా పేలవ ప్రదర్శన కనబర్చింది. ఓపెనర్లందరూ చేతులెత్తేశారు. దీంతో కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజ(45) పరుగులతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, జడేజ 2 వికెట్లు, పాండ్యా, కుల్దీప్ చెరో వికెట్ తీశారు. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ గెలిచిన టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Advertisement

Next Story