IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా

by Vinod kumar |   ( Updated:2023-07-27 13:13:13.0  )
IND vs WI: వెస్టిండీస్‌తో తొలి వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, విండీస్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గరువారం కెన్సింగ్టన్‌ ఓవల్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి పోరులో టీమ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. వరల్డ్‌కప్‌ సన్నాహాకాల్లో భాగంగా జరగుతున్న ఈ సిరీస్‌లో భారత జట్టు సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు టెస్టు సిరీస్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని కరేబియన్‌ జట్టు భావిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్‌ ఉంది. గురువారం మ్యాచ్‌ జరిగే సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్కడి వాతవారణ శాఖ తెలిపింది. మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం రావడానికి 50 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది అని వాతవారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా వర్షం కారణంగా భారత్‌-విండీస్‌ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశాన్ని భారత్‌ కోల్పోయింది.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

షాయ్ హోప్ (w/c), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్(w), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్

Advertisement

Next Story