Jasprit Bumrah: బుమ్రా రీ ఎంట్రీ.. తొలి టీ20 మ్యాచ్‌ వర్షార్పణమే?

by Vinod kumar |   ( Updated:2023-08-18 10:04:54.0  )
Jasprit Bumrah: బుమ్రా రీ ఎంట్రీ.. తొలి టీ20 మ్యాచ్‌ వర్షార్పణమే?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐర్లాండ్‌తో టీమిండియా ఆడే మొదటి టీ20 వర్షార్పణం అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. డబ్లిన్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మ్యాచ్ జరిగే రోజు 92 శాతం వర్షం పడే అవకాశం ఉంది. దీంతో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 14 నెలల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీలో బుమ్రా ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీసులో అతనే జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వరల్డ్ కప్ రెండింట్లో బుమ్రా కీలకం కానున్నాడు.

Advertisement

Next Story

Most Viewed