World Junior Championships : క్వార్టర్ ఫైనల్‌కు యువ షట్లర్ తన్వి శర్మ

by Harish |
World Junior Championships : క్వార్టర్ ఫైనల్‌కు యువ షట్లర్ తన్వి శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ సంచలనం తన్వి శర్మ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో 15 ఏళ్ల తన్వి 21-18, 21-13 తేడాతో జపాన్ షట్లర్ నీనా మత్సుత‌పై విజయం సాధించింది. 36 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌ను తన్వి రెండు గేమ్‌లను దక్కించుకుంది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవ్వగా.. రెండో గేమ్‌లో తన్వి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మరో క్రీడాకారిణి ఆలీషా నాయక్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రీక్వార్టర్స్‌లో మలేషియాకు చెందిన లిమ్ జి షిన్‌ను 21-17, 21-17 తేడాతో మట్టికరిపించింది. మెన్స్ సింగిల్స్ విభాగంలో ప్రణయ్ కూడా ముందడుగు వేశాడు. ప్రీక్వార్టర్స్‌లో ఏకనాథ్ కిత్కవిన్రోజ్(థాయిలాండ్)పై 21-4, 21-7 తేడాతో నెగ్గాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భార్గవ్ రామ్-వెన్నెల జోడీ 13-21, 16-21 తేడాతో చైనాకు చెందిన హాంగ్ యి లీ-జాంగ్ జియా హన్ ద్వయం చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Advertisement

Next Story

Most Viewed