ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. సంజూ స్థానంలో అతడు!

by Vinod kumar |
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. సంజూ స్థానంలో అతడు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం టీమ్‌ ఇండియా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సంజు శాంసన్‌ను ఈ సిరీస్‌లో ఆడిస్తారా..? లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. శుక్రవారం ఆరంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐరిష్​జట్టుతో పోటీ పడేందుకు బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ఐర్లాండ్‌కు పయనమైంది. అయితే ఇప్పుడున్న జట్టులో చాలా వరకు కొత్త ఆటగాళ్లే ఉన్నారు. వీరందరూ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే చాలా అవకాశాలను వృథా చేసుకున్న సంజు శాంసన్‌ను ఈ సిరీస్‌లో ఆడిస్తారా..? లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ.. సంజూ స్థానంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో జరగనున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడింట్లో బ్యాటింగ్‌ చేసిన శాంసన్‌.. ఆ సిరీస్‌లో వరుసగా 12, 7, 13 పరుగులు మాత్రమే స్కోర్​చేయగలిగాడు. దీంతో ఐర్లాండ్‌తో జరగనున్న సిరీస్‌లో అతనికి బదులు జితేశ్‌ శర్మ ఆడించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని సమాచారం.

29 ఏళ్ల మహారాష్ట్ర ఆటగాడు జితేశ్‌ శర్మ.. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడి అద్భుతంగా రాణించాడు. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతో పాటు 5 లేదా 6 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫినిషర్‌ పాత్ర పోషించాడు. ఆసియా క్రీడల్లో జితేశ్‌ను ఆడించేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపుతున్న తరుణంలో.. అంతకంటే ముందు అతనికి అంతర్జాతీయ అనుభవం కోసం ఐర్లాండ్‌తో మ్యాచ్‌ల్లో బరిలో దింపొచ్చు. ఐపీఎల్‌లో 3,800 పైగా పరుగులతో రాణించిన శాంసన్.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం తన సత్తా చాటలేకపోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 19 టీ20 మ్యాచ్‌లు ఆడి 18.62 సగటుతో కేవలం 333 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Advertisement

Next Story

Most Viewed