- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Swapnil Kusale : టికెట్ కలెక్టర్ టూ ఒలింపిక్ మెడలిస్ట్.. షూటర్ స్వప్నిల్ సక్సెస్ స్టోరీ ఇదే
దిశ, స్పోర్ట్స్ : అతను ఇండియన్ రైల్వేలో టికెట్ కలెక్టర్. ఉద్యోగం చేస్తూనే టోర్నీల్లో పాల్గొంటున్నాడు. ఎంతో కష్టపడి చివరికి తన కలను సాకారం చేసుకున్నాడు. ఇది చదువుతుంటే క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్ ధోనీనే గుర్తొచ్చి ఉంటాడు కదా. టీమిండియాలోకి అరంగేట్రం చేయకముందు ధోనీ టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్టోరీ ధోనీ గురించి కాదు. కానీ, ధోనీ నుంచి ప్రేరణ పొందిన మరో అథ్లెట్ గురించి. అతనెవరో కాదు.. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే. అవును.. స్వప్నిల్ కుసాల్ సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కట్ చేస్తే విశ్వక్రీడల్లో దేశానికి పతకం అందించాడు. తొలి విశ్వక్రీడల్లోనే స్వప్నిల్ మెడల్ గెలవడం మరో విశేషం.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని కంబల్వాడి గ్రామంలో 29 ఏళ్ల స్వప్నిల్ పుట్టి పెరిగాడు. అతని తండ్రి, సోదరుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు. తల్లి గ్రామ సర్పంచ్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన స్వప్నిల్ షూటింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ ధోనీని ప్రేరణగా తీసుకున్న అతను కల సాకారం కోసం కష్టపడ్డాడు. 2012 నుంచి స్వప్నిల్ అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. షూటర్‌గా స్వప్నిల్ ప్రయాణం కూడా ధోనీ తరహాలోనే సాగింది. ధోనీ టీమిండియాలోకి అరంగేట్రం చేయకుముందు టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. స్వప్నిల్ కూడా 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పుణెలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆ సంపాదనతో తొలి రైఫిల్ కొనుగోలు చేశాడు. కొన్ని సార్లు ప్రాక్టీస్ కోసం బుల్లెట్లు కొనడానికి కూడా సరిపడా డబ్బులు ఉండేవి కాదని ఓ ఇంటర్వ్యూలో స్వప్నిల్ చెప్పాడు. 2012 నుంచి అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటున్న అతను ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి 12 ఏళ్లు ఎదురుచూశాడు. 2015లో జరిగిన జూనియర్ ఏషియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ 3 కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలిచాడు. 2021 నుంచి అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఆ ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో, గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ కేటగిరీలో భారత జట్టు స్వర్ణం సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 2022లో వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో 4వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్ కోటా సాధించాడు.
ధోనీని ఆరాధిస్తా..
షూటింగ్‌లో తాను ఎవరినీ అనుకరించనని, షూటింగ్ బయట తాను ధోనీని ఆరాధిస్తానని క్వాలిఫికేషన్ రౌండ్ పూర్తయిన తర్వాత స్వప్నిల్ మీడియాతో చెప్పాడు. ‘షూటింగ్ ప్రపంచంలో నేను ఎవరినీ అనుకరించను. ధోనీని ఆరాధిస్తాను. అతను మైదానంలో ఎంతో ప్రశాంతంగా, ఓపికగా ఉంటాడు. షూటర్‌గా నాకు అది అవసరం. ధోనీ బయోపిక్‌ను చాలా సార్లు చూశాను. నేను కూడా టికెట్ కలెక్టర్. అతని స్టోరీతో నాకు సంబంధం ఉంది.’ అని తెలిపాడు.