అవును.. వన్డేలో పేలవంగా ఆడుతున్నా : Suryakumar Yadav

by Vinod kumar |
అవును.. వన్డేలో పేలవంగా ఆడుతున్నా : Suryakumar Yadav
X

న్యూఢిల్లీ : టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విండీస్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. కీలకమైన మూడో టీ20లో బ్యాటు ఝుళిపించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, వన్డేల్లో మాత్రం సూర్యకుమార్ ప్రదర్శన ఏం మాత్రం బాగా లేదు. మూడో టీ20 అనంతరం దీనిపై సూర్యకుమార్ స్పందించాడు. వన్డేల్లో తన ప్రదర్శన పేలవంగా ఉందని అంగీకరించాడు. ‘నిజాయతీగా ఉండటం చాలా ముఖ్యం. వన్డేల్లో నా ఆట బాగా లేదు. ఇలా చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ‘ఈ ఫార్మాట్‌లో నువ్వు ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. దాని గురించి ఆలోచించు. చివరి 15 లేదా 18 ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తే ఎలా ఆడతావో అలానే ఆడు’ అని రోహిత్, రాహుల్ ద్రవిడ్ చెప్పారు.’ అని సూర్య తెలిపాడు. తనవరకు వన్డే ఫార్మాట్ చాలెంజింగ్ ఉంటుందని చెప్పాడు.

‘వన్డే మ్యాచ్‌లో త్వరగా వికెట్లు కోల్పోతే టెస్టుల్లో ఆడినట్టు ఆడాలి. చివర్లలో టీ20 మ్యాచ్‌లాగా ఆడాలి. అందుకే, నా వరకు వన్డే ఫార్మాట్ చాలెంజింగ్ ఉంటుంది. వన్డేల్లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తా. నాకు ఇచ్చిన బాధ్యతలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది నా చేతుల్లోనే ఉంది.’ అని తెలిపాడు. అలాగే, మూడో టీ20లో తృటిలో సెంచరీ మిస్ అవడంపై స్పందిస్తూ..‘నేను మైలురాళ్లను లెక్కలోకి తీసుకోను. 47 పరుగులు లేదా 98 పరుగులు వద్ద ఉన్నప్పటికీ నేను నా జట్టు చెప్పినట్టే ఆడతాను.’ అని చెప్పుకొచ్చాడు. విండీస్‌పై మూడో టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. 44 బంతుల్లో 83 పరుగులు చేశాడు. సూర్య రెచ్చిపోవడంతో టీమ్ ఇండియా 160 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed