- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్డేల్లో సూర్యకుమార్ చెత్త రికార్డ్
దశ, వెబ్ డెస్క్: టీ20ల్లో నెం.1 ఐసీసీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌లో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, మూడో వన్డేలోనూ మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. తొలి వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటైన సూర్యకుమార్ యాదవ్, రెండో వన్డేలోనూ కాపీ పేస్ట్ చేశాడు.
స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. గత రెండు వన్డేల్లో ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి దింపింది టీమిండియా మేనేజ్‌మెంట్. తొలి రెండు వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు.
మొదటి రెండు మ్యాచుల్లో ఆసీస్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, మూడో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ అస్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయిన బ్యాటర్‌గా అతి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. మూడు వన్డేల సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే.