Sunil Gavaskar : ఆ చాన్స్ బ్యాటర్లకు లేనప్పుడు బౌలర్లకు ఎందుకు? : సునీల్ గవాస్కర్

by Harish |   ( Updated:2024-07-18 13:36:10.0  )
Sunil Gavaskar  : ఆ చాన్స్ బ్యాటర్లకు లేనప్పుడు బౌలర్లకు ఎందుకు? : సునీల్ గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు అనధికార డ్రింక్ బ్రేక్‌‌లను నిలిపివేయాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అధికారులను కోరాడు. సాధారణంగా ఆట సమయంలో అధికారిక డ్రింక్ బ్రేక్స్ ఉంటాయి. అవి కాకుండా ఆట మధ్యలో బౌండరీ లైన్ వద్ద ఫాస్ట్ బౌలర్లు హైడ్రేటెడ్‌గా ఉండటానికి డ్రింక్స్ తీసుకుంటారు. తాజాగా సునీల్ గవాస్కర్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.

జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఓవర్ తర్వాత బౌలర్లు అనధికారిక డ్రింక్ బేక్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది బౌలర్లకు అదనపు ప్రయోజనమని వ్యాఖ్యానించాడు. ‘ఆరు బంతులు వేసిన తర్వాతే బౌలర్లు హైడ్రేటెడ్ అవుతే అధికారిక డ్రింక్ బ్రేక్స్ ఎందుకు?. ఓవర్ తర్వాత డ్రింక్ తీసుకునే అవకాశం బ్యాటర్‌కు లేదు. ఓవర్‌లో బ్యాటర్ 8 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తీయొచ్చు. అవన్నీ పరుగులే కదా.’ అని తెలిపాడు. గంట తర్వాతే డ్రింక్ బ్రేక్స్ ఇవ్వాలని, అదనపు విరామం కావాలంటే ప్రత్యర్థి కెప్టెన్, అంపైర్ అనుమతి తీసుకోవాలన్నాడు.

Advertisement

Next Story

Most Viewed