ముగిసిన సుమిత్ పోరాటం

by Harish |
ముగిసిన సుమిత్ పోరాటం
X

దిశ, స్పోర్ట్స్ : మోంటె కార్లో మాస్టర్స్ టెన్నిస్‌ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ సంచలన ప్రదర్శనకు తెరపడింది. ఈ టోర్నీలో అదరగొట్టిన అతను మెయిన్ డ్రాకు అర్హత సాధించడంతోపాటు రెండో రౌండ్‌కు చేరుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. రెండో రౌండ్‌లో అతని పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో సుమిత్ 3-6, 6-3, 2-6 తేడాతో 7వ సీడ్, డెన్మార్క్ స్టార్ హోల్గర్ రూనె చేతిలో పోరాడి ఓడాడు. తనకంటే మెరుగైన ర్యాంక్‌ ఆటగాడికి సుమిత్ గట్టిపోటినిచ్చాడు. తొలి సెట్ కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న అతను రెండో సెట్‌ గెలుచుకుని ప్రత్యర్థికి షాక్ ఇచ్చేలా కనిపించాడు. అయితే, నిర్ణయాత్మక మూడో సెట్‌లో రూనెను నిలువరించలేకపోయాడు. 20 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed