- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోంటె కార్లో మాస్టర్స్ మెయిన్ డ్రాకు సుమిత్.. 42 ఏళ్లలో తొలి భారత ఆటగాడు
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్ ఫ్రాన్స్‌లో జరుగుతున్న మోంటె కార్లో మాస్టర్స్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన క్వాలిఫయర్స్ రెండో రౌండ్‌లో సుమిత్ 7-5, 2-6, 6-2 తేడాతో 3వ సీడ్, అర్జెంటీనా ప్లేయర్ డియాజ్ అకోస్టాపై విజయం సాధించాడు. 2 గంటల 25నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణయాత్మక మూడో సెట్‌లో సుమిత్ గెలుపు లాంఛనమైంది. తొలి సెట్ నెగ్గి శుభారంభం చేసిన అతనికి రెండో సెట్‌లో ప్రత్యర్థి షాకిచ్చాడు. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌లో బలంగా పుంజుకున్న సుమిత్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏకపక్షంగా మూడో సెట్ గెలుచుకున్నాడు. అర్జెంటీనా ప్లేయర్ 3 డబుల్ ఫౌల్ట్స్, 16 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.
సుమిత్ తన కెరీర్‌లో తొలిసారిగా ఈ టోర్నీ మెయిన్ డ్రాకు చేరుకున్నాడు. అంతేకాకుండా, 42 ఏళ్లలో ఈ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచాడు. చివరిసారిగా 1982లో రమేశ్ కృష్ణన్ మెయిన్ డ్రాకు చేరుకున్నాడు. అయితే, తొలి రౌండ్‌లోనే అతను ఓడిపోయాడు. సోమవారం జరిగే తొలి రౌండ్‌లో అర్జెంటీనా ఆటగాడు ఫెడెరికో కొరియాతో సుమిత్ తలపడనున్నాడు.