ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సుమిత్

by Harish |
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సుమిత్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నగాల్ మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడబోతున్నాడు. క్వాలిఫయర్స్ ద్వారా మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ మ్యాచ్‌లో సుమిత్ 6-4, 6-4 తేడాతో స్లోవేకియా ఆటగాడు అలెక్స్ మోల్కాన్‌ను చిత్తు చేశాడు. 2 గంటలకుపైగా ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా సుమిత్ ఏమాత్రం పట్టుదల వదలకుండా వరుసగా రెండు సెట్లను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో 10వ గేమ్‌లో ప్రత్యర్థి డబుల్ ఫౌల్ట్ చేయడంతో సుమిత్ విజయం ఖాయమైంది. దీంతో 2021 తర్వాత సుమిత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అర్హత సాధించాడు. 2021లో అతను తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యాడు. ఈ సారి కూడా అతను తొలి రౌండ్‌లో కఠిన ప్రత్యర్థితో తలపడనున్నాడు. సోమవారం జరిగే ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం వరల్డ్ నం.139 ర్యాంక్‌లో ఉన్న సుమిత్.. వరల్డ్ నం.31, కజకిస్తాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్‌తో పోటీపడనున్నాడు.

Advertisement

Next Story