- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు సుమిత్
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల సత్తాచాటుతున్న భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్(ఏటీపీ) సోమవారం రిలీజ్ చేసిన మెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 80వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గత వారం 93 ర్యాంక్‌లో నిలిచిన అతను ఏకంగా 13 స్థానాలు ఎగబాకాడు. మోంటె కార్లో మాస్టర్స్ టోర్నీలో సత్తాచాటడంతో అతని ర్యాంక్ మెరుగుపడింది. దీంతో ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించిన 7వ భారత ప్లేయర్‌గా సుమిత్ నిలిచాడు. 1980లో భారత దిగ్గజ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్ సాధించగా సింగిల్స్‌లో ఇప్పటికీ భారత్ తరపున హయ్యెస్ట్ ర్యాంక్ సాధించిన రికార్డు అతని పేరిటే ఉంది. నోవాక్ జకోవిచ్(సెర్బియా) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు, భారత డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో నం.1 స్థానాన్ని కోల్పోయాడు. తన పార్ట్‌నర్, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ అగ్రస్థానానికి చేరుకోగా.. బోపన్న రెండో స్థానానికి పడిపోయాడు.