ICC World Cup 2023: బంగ్లాదేశ్ టెక్నిక‌ల్ క‌న్సల్టెంట్‌గా భార‌త మాజీ స్పిన్నర్..

by Vinod kumar |
ICC World Cup 2023: బంగ్లాదేశ్ టెక్నిక‌ల్ క‌న్సల్టెంట్‌గా భార‌త మాజీ స్పిన్నర్..
X

దిశ, వెబ్‌డెస్క్: వ‌న్డే ప్రపంచ క‌ప్ ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. బౌలింగ్ యూనిట్‌ను ప‌టిష్టం చేయ‌డం కోసం భారత మాజీ స్పిన్నర్ శ్రీ‌ధ‌ర‌న్ శ్రీ‌రామ్‌ను టెక్నిక‌ల్ క‌న్సల్టెంట్‌గా నియ‌మించింది. శ్రీ‌రామ్ గతంలో బంగ్లా టీ20 జ‌ట్టుకు హెడ్ కోచ్‌గా ప‌నిచేయగా.. అత‌డి ఆధ్వర్యంలో ఆ జ‌ట్టు సూప‌ర్ 12లో అద్భుత విజ‌యాలు సాధించింది. దాంతో, మెగా టోర్నీలో అత‌డి సేవల్ని ఉప‌యోగించుకోవాల‌ని బంగ్లా సెలెక్టర్లు భావించారు. ‘అవును.. వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం మేము శ్రీ‌రామ్‌ను టెక్నిక‌ల్ క‌న్సల్టెంట్‌గా నియ‌మించాం’ అని బంగ్లా టీమ్ డైరెక్టర్ ఖ‌లీద్ మ‌హ్మద్‌ తెలిపాడు. శ్రీ‌రామ్‌కు ప‌లు జ‌ట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభ‌వం ఉంది.

ఆస్ట్రేలియా టీ20 జ‌ట్టుకు 2021- 22 సీజ‌న్‌లో స‌హాయ‌క కోచ్‌గా ప‌ని చేశాడు. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్ పురుషుల టీ20 జ‌ట్టుకు కోచ్‌గా శ్రీ‌రామ్ సేవ‌లందించాడు. అత‌డి హ‌యాంలో బంగ్లా జ‌ట్టు సూప‌ర్ 12లో అద్భుత విజ‌యాలు సాధించింది. ఈ మ‌ధ్యే ఐపీఎల్ ఫ్రాంచైజీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అసిస్టెంట్ కోచ్‌గా శ్రీ‌రామ్ బాధ్యత‌లు చేప‌ట్టాడు. 17వ సీజ‌న్‌లో అత‌ను హెడ్‌కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్‌, స్ట్రాట‌జిక్ క‌న్సల్టెంట్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌‌తో క‌లిసి ప‌ని చేయ‌నున్నాడు. ఆసియా క‌ప్ ముందు త‌మీమ్ ఇక్బాల్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. దాంతో మాజీ సార‌థి ష‌కిబుల్ హ‌స‌న్‌కు సెలెక్టర్లు బాధ్యత‌లు అప్పగించారు. అక్టోబ‌ర్ 5న భార‌త్‌లో ప్రపంచ క‌ప్ 2023 షురూ కానున్నాయి. అక్టోబ‌ర్ 7న అఫ్గనిస్థాన్‌తో బంగ్లాదేశ్‌ త‌ల‌ప‌డ‌నుంది.

Advertisement

Next Story