బతుకమ్మ పండుగ వేళ భారమైన బంతి

by Sridhar Babu |
బతుకమ్మ పండుగ వేళ భారమైన బంతి
X

దిశ,బెల్లంపల్లి : సద్దుల బతుకమ్మ పుణ్యమా అని బంతి పూల రేటు చుక్కలు తాకుతున్నాయి. బెల్లంపల్లి మార్కెట్లో కిలో బంతి పూలు రూ.300 రేటు పలుకుతోంది. సద్దుల బతుకమ్మ పండుగ కోసం బెల్లంపల్లిలో పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తీరొక్క పూల విక్రయాలతో మార్కెట్లో సందడి నెలకొంది. మునుపెన్నడూ లేనంతగా బంతి పూల రేటు కొండెక్కింది. కిలో బంతి రూ.300 పలకడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయినప్పటికీ బంతి పూలు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. మధ్యాహ్నం వరకే మార్కెట్లో బంతి పూలు పూర్తిగా అమ్ముడు పోయాయి. బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దడంలో బంతి పూలు కీలకం కావడంతో వినియోగదారులు ఎంత రేటయినా కొంటున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ వేళ బంతిపూల ధర ప్రజలను బెంబేలెత్తిస్తుంది. బంతి సాగులో సంక్షోభం వెరసి పూల ధర ఒక్కసారిగా పెరిగింది. దీంతో కిలో కి రూ.300 రేటు అయినా దొరకడం లేదు.

Advertisement

Next Story