Sex & Science: నా ప్రియుడికి అమ్మాయిలపై కోరికలు లేవు.. అబ్బాయిలంటేనే ఇష్టమట!

by Bhoopathi Nagaiah |
Sex & Science: నా ప్రియుడికి అమ్మాయిలపై కోరికలు లేవు.. అబ్బాయిలంటేనే ఇష్టమట!
X

నేను డిగ్రీ పూర్తి చేశాను. మా ఇంటి దగ్గర ఉండే ఓ అబ్బాయిని ప్రేమించాను. ఆ విషయం అతనితో చెబితే ఇష్టం లేదన్నాడు. చచ్చిపోతానని బెదిరించాను. దాంతో అతను తను ఆడపిల్ల స్వభావం కలిగి ఉన్నానని. తనకు మగాళ్లను చూస్తేనే ఆకర్షణ కలుగుతుందని చెప్పాడు. నేనంటే ఇష్టం లేక అలా చెబుతున్నాడేమో అనుకుని ఆరా తీస్తే అతను నిజంగానే స్వలింగ సంపర్కి అని తెలిసింది. ఈ సమస్యకు పరిష్కారం ఉందా? ఉంటే ఎలాగైనా అతనిని ఒప్పించి చికిత్స చేయిస్తాను. తనను ఆరోగ్యవంతమైన పురుషునిగా చేయాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి.

తనంత స్పష్టంగా చెప్పాక కూడా నీకు అతని పట్ల ప్రేమ తగ్గకపోవడం ఏమిటి? తగ్గాలని లేదు కానీ ప్రాక్టికల్‌గా ఆలోచించాలి కదా! ఎందుకంటే స్వలింగ సంపర్కుల(Homosexuals)కు ఎయిడ్స్ (Aids) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతని మీద నీకంత ప్రేమ ఉంటే ముందు హెచ్ఐవీ (HIV) టెస్ట్ చేయించటం మంచిది. అతడు ఆరోగ్యవంతుడని నిర్ధారించుకున్న తర్వాత మంచి సైకాలజిస్టు(Psychologist) దగ్గరకు తీసుకెళ్లి సైకోథెరపీ(Psychotherapy) చేయించు. సెక్సాలజిస్టును కలిసి చికిత్స ఇప్పిస్తే అతనికి నార్మల్ సెక్సువల్ బిహేవియర్(Sexual Behavior) వస్తుంది. ఏది చేసినా ఆలోచించి చెయ్యి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story