- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాడ్.. 832 పరుగులతో వరల్డ్ రికార్డ్ బ్రేక్
దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ దేశంలోని ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. కాగా ఈ మ్యాచులో పాకిస్తాన్ జట్టుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో 556 పరుగుల భారీ స్కోర్ చేసిన పాక్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల దెబ్బకు కుదేలైంది. ముఖ్యంగా జో రూట్, హారీ బ్రూక్ లు పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇద్దరు ప్లేయర్లు నాలుగో వికెట్ కు ఏకంగా 454 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. చరిత్ర సృష్టించారు. అలాగే ఈ మ్యాచుల్లో జో రూట్ 374 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో 262 పరుగులు చేసి అవుట్ కాగా.. హారీ బ్రూక్ 322 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు 29 ఫోర్లతో ఏకంగా 317 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. అలాగే క్రావ్లే 78, డక్కెట్ 84, స్మిత్ 31 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆటలో 150 ఓవర్లకు ఏకంగా 823-7 వద్ద డిక్లేర్ ఇచ్చింది.