- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌పై శ్రీలంక విజయం.. సిరీస్ సమం
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో మెుదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. శ్రీలంక ఓపెనర్లు పథున్ నిస్సంక (33), కుశాల్ మెండిస్ (31 బంతుల్లో 52) శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 80 పరుగులు జోడించారు. ఆఖర్లో కెప్టెన్ షనక విధ్వంసం సృష్టించాడు. కుశాల్ మెండిస్ (32) మెరుపు ఆరంభానికి అసలంక (19 బంతుల్లో 37), కెప్టెన్ షనక (22 బంతుల్లో 56 నాటౌట్) విధ్వంసం తోడు కావడంతో లంక భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు, యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్షదీప్ సింగ్ 5 నోబాల్స్ వేయడంతోపాటు 37 పరుగులు ఇచ్చుకున్నాడు.
భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన టీమిండియా ఓటమి పాలైంది. భారత్ పై 16 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 190 రన్స్ మాత్రమే చేసింది. భారత్ బ్యాటింగ్‌లో అక్షర్ పటేల్ 65, సూర్య కుమార్ 51 పరుగులు చేశారు. మూడు టీ20 లో 1-1 సిరీస్‌ను సమం చేసింది.