IND VS SL : శ్రీలంక వన్డే కెప్టెన్‌పై వేటు.. భారత్‌తో వన్డే సిరీస్‌‌కు జట్టు ఎంపిక

by Harish |
IND VS SL : శ్రీలంక వన్డే కెప్టెన్‌పై వేటు.. భారత్‌తో వన్డే సిరీస్‌‌కు జట్టు ఎంపిక
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాతో వన్డే సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) మంగళవారం తమ జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. వన్డే కెప్టెన్ కుసాల్ మెండిస్‌పై ఎస్‌ఎల్‌సీ వేటు వేసింది. వన్డే పగ్గాలు కూడా చరిత్ అసలంకకే అప్పగించింది. టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యం తర్వాత హసరంగ పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా తప్పుకోగా అతని స్థానంలో అసలంకను సారథిగా నియమించిన విషయం తెలిసిందే. దాదాపుగా టీ20 జట్టులోని ప్లేయర్లనే వన్డే జట్టులో చోటు సంపాదించారు. వికెట్ కీపర్ నిసాన్ మధుశంక తొలిసారిగా వన్డే జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. అలాగే, బంగ్లాదేశ్‌తో గత వన్డే సిరీస్‌లో ఆడిన సహాన్ అరాచ్చిగే, ప్రమోద్ మదుషన్, లాహిరు కుమారాలను పక్కనపెట్టారు. పేసర్ పతిరణ, అసిత ఫెర్నాండో తిరిగి వన్డే జట్టులో చోటు సాధించారు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరగనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

శ్రీలంక జట్టు : అసలంక(కెప్టెన్), నిశాంక, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, సమరవిక్రమ, కామిందు మెండసి్, జనిత్ లియానగే, హసరంగ, దునింత్ వెల్లలాగే, కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల ధనంజయ, మధుశంక, పతిరణ, అసిత ఫెర్నాండో.

Advertisement

Next Story