- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL SRH: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్.. దటీజ్ కావ్య!

దిశ,వెబ్‌డెస్క్: IPL SRH : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ త్వరలోనే టాప్-3 బ్రాండ్ వాల్యూ కలిగిన జట్టుగా నిలవడం ఖాయంగానే కనిపిస్తోంది. అటు 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL అంటేనే కోట్ల కొద్దీ ఆదాయం. 2008 నుంచి మొదలైనప్పటి నుంచి ఈ లీగ్ రోజురోజుకూ దూసుకుపోతూనే ఉంది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు, యజమానులు మాత్రమే కాదు... బ్రాడ్‌కాస్టర్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్.. అందరూ ఐపీఎల్ ద్వారా లాభపడుతున్నారు. ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ టోర్నమెంట్, ఈసారి కూడా భారీ వసూళ్లపై కన్నేసింది. వ్యూయర్‌షిప్ మరింత పెరగనుంది.
ఇలాంటి లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది ఈ జట్టు కొత్త రికార్డులు సృష్టించింది. కావ్య మారన్ నాయకత్వంలో ఒక మెట్టెక్కుతూ ఎదుగుతున్న సన్‌రైజర్స్, 2023 సీజన్ ఫైనల్‌కు చేరింది. కప్‌ను అందుకోవడంలో కొద్దిలో తప్పిపోయినా, బ్రాండ్ వాల్యూలో మాత్రం గట్టి గుర్తింపు సంపాదించింది. 2012లో సన్ టీవీ గ్రూప్ కేవలం 85 కోట్లతో ఈ జట్టును సొంతం చేసుకుంది. కానీ 12 ఏళ్లలోనే ఊహించని స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ బ్రాండ్ విలువ ఏకంగా 735 కోట్లు. అంతేకాదు, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇతర జట్లతో పోలిస్తే 76శాతం పెరుగుదల సాధించి, లీగ్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుంది.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు 1000 కోట్ల మార్క్‌ను దాటాయి. ఇండియన్ స్టార్ ప్లేయర్లు పెద్దగా లేని సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 1000 కోట్ల బ్రాండ్ విలువకు చేరువ అవ్వడం చిన్న విషయం కాదు. నిజానికి 2024లో SRH ఆకట్టుకున్నా, నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మెగా ఆక్షన్, కొత్త ప్లేయర్ల ఎంపిక, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితం అనే స్ట్రాటజీతో సన్‌రైజర్స్ ముందుకు సాగుతోంది. కొత్త తరహా కోచింగ్, మంచి బ్యాటింగ్-బౌలింగ్ కాంబినేషన్‌తో రానున్న సీజన్లలో మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
అంతేకాదు మార్కెటింగ్, కమర్షియల్ డీల్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆదాయాన్ని పెంచుతూ, బ్రాండ్ వాల్యూను మరింతగా పెంచేందుకు ఫ్రాంచైజీ కష్టపడుతోంది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియా స్ట్రాటజీ కూడా సన్‌రైజర్స్ బ్రాండ్‌ను బలంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఫ్రాంచైజీ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జట్టు, రాబోయే ఐదు సంవత్సరాల్లోనే టాప్-3 బ్రాండ్ వాల్యూలో ఒకటిగా నిలవడం ఖాయం. అటు 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.