- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్రిగ్స్ పోరాటం వృథా.. తొలి టీ20లో భారత మహిళల జట్టుకు పరాజయం
దిశ, స్పోర్ట్స్ : వన్డే సిరీస్, ఏకైక టెస్టు విజయాలతో దూకుడు మీద ఉన్న భారత మహిళల జట్టు జోరుకు బ్రేక్ పడింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. చెన్నయ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. తాజ్‌మిన్ బ్రిట్స్(81), మారిజన్నె కాప్(57) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ వొల్వార్డ్ట్(33) పర్వాలేదనిపించింది. అనంతరం ఛేదనకు దిగిన భారత జట్టును సౌతాఫ్రికా బౌలర్లు కట్టడి చేశారు. దీంతో టీమ్ ఇండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 177 పరుగులే చేసింది. రోడ్రిగ్స్(53 నాటౌట్) చివరి వరకూ పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. స్మృతి మంధాన(46), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(35) రాణించారు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడింది. ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది.