- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెలరేగిన శ్రీలంక స్పిన్నర్ జయసూర్య.. తొలి టెస్టులో కివీస్‌కు షాక్
దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించింది. గల్లె వేదికగా సోమవారం ముగిసిన మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. స్పిన్నర్ జయసూర్య(5/68) ఐదు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 305 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 340 రన్స్‌కు ఆలౌటైంది. ఇక, 35 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన శ్రీలంక 309 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు 274 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
274 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ను శ్రీలంక బౌలర్లు 211 పరుగులకే కట్టడి చేశారు. ఆదివారమే 207/8 స్కోరుతో న్యూజిలాండ్ గెలుపుపై ఆశలు కోల్పోగా.. చివరి రోజు మరో 4 పరుగులు మాత్రమే ఓడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. ఒంటరి పోరాటం చేసిన రచిన్ రవీంద్ర(92) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివరి వికెట్‌గా విలియమ్ ఒరోర్కే(0) అవుట్‌తో న్యూజిలాండ్ ఆట ముగిసింది. ఆఖరి రెండు వికెట్లు స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఖాతాలోకే వెళ్లాయి. రమేశ్ మెండిస్(3/83) కూడా సత్తాచాటాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నెల 26-30 మధ్య గల్లె వేదికగానే రెండో టెస్టు జరగనుంది.