- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక.. సిరీస్ కైవసం
by Vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: హంబన్‌తోట వేదికగా మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకుంది. లంక బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు తలవంచారు. ఈ రోజు జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. చమీర (4/63), హసరంగ (3/7), లహీరు కుమార (2/29), తీక్షణ (1/16) చెలరేగడంతో 22.2 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (51), దిముత్ కరుణరత్నే (56 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కేవలం 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Next Story