Sikandar Raza: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సికిందర్ రజా.. టాప్ ప్లేస్ కి వెళ్లిన జింబాబ్వే

by Prasanna |   ( Updated:2024-10-24 06:30:28.0  )
Sikandar Raza: రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సికిందర్ రజా.. టాప్ ప్లేస్ కి వెళ్లిన జింబాబ్వే
X

దిశ, వెబ్ డెస్క్ : జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా ఇంటర్నేషనల్ టీ20 ( International T20) క్రికెట్‌లో వరల్డ్ రికార్డు సాధించాడు. 33 బంతుల్లోనే వంద పరుగులు చేసి టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ రికార్డును బ్రేక్ చేసాడు. ఐసీసీ మెన్స్‌ టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌ మ్యాచ్ బుధవారం రోజు జింబాబ్వే , గాంబియాతో తలపడింది.

ఆటగాళ్లలో T20 ఫాస్టెస్ట్‌ సెంచరీలు చేసింది వీరే

1. సికందర్‌ రజా(zimbabwe)- గాంబియాపై 33 బాల్స్ లో సెంచరీ

2. డేవిడ్‌ మిల్లర్‌(South Africa)- బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో సెంచరీ

3. రోహిత్‌ శర్మ(India)- శ్రీలంకపై 35 బాల్స్ లో సెంచరీ

4. జాన్సన్‌ చార్ల్స్‌(West Indies)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో సెంచరీ

5. సంజూ శాంసన్‌(India)- బంగ్లాదేశ్‌పై 40 బాల్స్ లో సెంచరీ

15 సిక్సర్లతో మరో రికార్డు

గాంబియాతో మ్యాచ్‌లో 33 బాల్స్ లో సికందర్‌ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్‌లతో మొత్తం 133 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే సికందర్‌ రజా ఇంకో కొత్త రికార్డును కూడా తన అకౌంట్ లో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల లిస్టులో చేరాడు.

ఈ లిస్టులో సాహిల్‌ చౌహాన్‌, హజ్రతుల్లా జజాయ్‌, ఫిన్‌ అలెన్‌ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్‌ రజా, జీషన్‌ కుకిఖెల్‌ 15 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గాంబియాపై 344 భారీ స్కోర్ చేసి వరల్డ్ రికార్డు సాధించింది.

Advertisement

Next Story

Most Viewed