SHOOTING : దివ్యాన్ష్ సింగ్, రమిత‌లకు స్వర్ణం

by Harish |
SHOOTING : దివ్యాన్ష్ సింగ్, రమిత‌లకు స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీలో జరుగుతున్న ఐఎస్‌ఏఎస్-2024 షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు సత్తాచాటారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో దివ్యాన్ష్ సింగ్, రమిత స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల కేటగిరీలో దివ్యాన్ష్ సింగ్ 254.4 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ప్రదర్శనతో తన పేరిట వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇదే కేటగిరీలో మరో భారత షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ 252.4 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. మహిళల కేటగిరీలో రమిత 254.1 స్కోరుతో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. అలాగే, చైనా షూటర్ హన్ జియో(254.0)పేరిట ఉన్న వరల్డ్ రికార్డును అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది.

మరోవైపు, పొలాండ్‌లో జరిగిన పొలిష్ గ్రాండ్ ప్రిక్స్‌ టోర్నీలో భారత షూటర్లు మెరిశారు. ఐదు పతకాలతో టోర్నీని ముగించారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ కేటగిరీలో అఖిల్(468.4) స్వర్ణం సాధించాడు. నీరజ్ కుమార్ రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. మహిళల కేటగిరీలో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో శ్రియాంక, ఆషి చౌక్సే రజత పతకాలు గెలుచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed