భారత టాప్ ఆర్డర్‌ను చులకన చేస్తూ.. ట్వీట్ చేసిన పాక్ మాజీ పేసర్

by Vinod kumar |   ( Updated:2022-08-21 12:04:58.0  )
భారత టాప్ ఆర్డర్‌ను చులకన చేస్తూ.. ట్వీట్ చేసిన పాక్ మాజీ పేసర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆసియా కప్ 2022కి పాకిస్థాన్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ కవ్వించే స్టేట్ మెంట్‌ తన ట్వట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. గాయం కారణంగా షాహీన్ ఆసియా కప్‌కు దూరం కానున్నాడు. దీంతో షాహీన్ గాయాన్ని ప్రస్తావిస్తూ.. ఆసియా కప్‌ టోర్నీకి ఫాస్ట్ బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రిది అందుబాటులో లేకపోవడం 'చాలా బాధగా ఉంది' అని వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు. షాహీన్ గాయం వల్ల దూరమవ్వడం భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు పెద్ద ఉపశమనం అంటూ వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు. వకార్ చేసిన ట్వీట్ పై భారత క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌ వర్సెస్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ 10 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్థాన్‌తో భారత్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి.


Advertisement

Next Story