- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లిస్ట్ ఏ క్రికెట్‌లో షఫాలీ వర్మ సంచలనం.. ఫాసెస్ట్ సెంచరీ నమోదు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా బ్యాటర్ షఫాలీ వర్మ సంచలనం సృష్టించింది. మహిళల లిస్ట్ ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. మహిళల ఇంటర్ జోనల్ వన్డే ట్రోఫీలో నార్త్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షఫాలీ వర్మ సోమవారం నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 64 బంతుల్లో 133 పరుగులతో అజేయంగా నిలిచింది. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన షఫాలీ వర్మ.. మహిళల వన్డే ఫార్మాట్‌లో ఫాస్టెస్ సెంచరీ రికార్డు కలిగిన ఇంగ్లాండ్‌కు చెందిన నాట్ స్కివర్ బ్రంట్(66 బంతుల్లో) కంటే వేగంగా శతకం బాదింది.
ఇక, మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్త్ జోన్.. షెఫాలీ వర్మ(133 నాటౌట్)తోపాటు అమన్‌జోత్ కౌర్(92), ప్రియా పూనియా(52) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో నార్త్ ఈస్ట్ జోన్ 147 పరుగులకే ఆలౌటైంది. సెంటిలెమ్లా(64) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు తేలిపోయారు. నందనీ శర్మ 3 వికెట్లు, మన్నత్ కశ్యప్ 2 వికెట్లతో నార్త్ ఈస్ట్ జోన్‌ను కట్టడి చేశారు.
- Tags
- #Shafali Verma