- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sri Lanka: శ్రీలంక క్రికెట్‌లో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టార్ బ్యాట్స్‌మెన్
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక క్రికెట్ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గురువారం కుటుంబ సభ్యలతో కలిసి ఆలయానికి వెళ్తుండగా అనురాధపుర సమీపంలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో తిరిమన్నెతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా గాయలయ్యాయి. గమనించి స్థానికులు వారందిరిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యంగా నిలకడగా ఉంది. తిరిమన్నెకు ప్రమాదం జరిగిందని తెలియగానే శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో ఉన్న తిరిమన్నె త్వరగా కోలుకోని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
అయితే, 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఎడమచేతి వాటం బాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2,088, 3,164, 291 పరుగులు చేశాడు. గతేడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లాహిరు తిరిమన్నె ప్రస్తుతం అతడు లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2024 ఈవెంట్లో పాల్గొంటున్నాడు. న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.