- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క దంపతులు.. నిజమేనా?
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే విరుష్క దంపతులకు మొదటి సంతానంగా వామిక జన్మించగా.. అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయాన్ని కోహ్లీ ఫ్రెండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వెల్లడించాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడిన అతను విరాట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ‘అతను బాగానే ఉన్నాడని నాకు తెలుసు. కుటుంబంతో గడుపుతున్నాడు. అందుకే తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అతనితో చాట్ చేశాను. ఉన్నావని అడిగాను. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఉండాలని ఉందని కోహ్లీ చెప్పాడు. అతను రెండోసారి తండ్రికాబోతున్నాడు. ఇప్పుడు కుటుంబంతో ఉండటం అతనికి ముఖ్యం.’ అని తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో జాతీయ జట్టుకు దూరమవడంపై కోహ్లీపై వచ్చిన వార్తలపై డివిలియర్స్ స్పందించాడు. ‘చాలా మంది తమ కుటుంబమే మొదటి ప్రాధానత్య. ఆ విషయంలో కోహ్లీని జడ్జ్ చేయలేరు. అతన్ని మిస్ అవుతున్నాం. నిజమే. కానీ, అతను సరైన నిర్ణయం తీసుకున్నాడు.’ అని చెప్పాడు.
కొంతకాలంగా విరుష్క దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, వాటిపై వారు స్పందించలేదు. తాజాగా ఏబీ డివిలియర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలే నిజమయ్యాయి. దీంతో ఈ న్యూస్ కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుడ్ న్యూస్ చెప్పావు మిస్టర్ 360 అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు జూనియర్ కోహ్లీ వస్తున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్ చిన్ననాటి ఫొటోను వైరల్ చేశారు.
కాగా, ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు విరాట్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో అతను ఈ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తెలిపింది. అయితే, మిగతా సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా అనుష్క మరోసారి గర్భం దాల్చడంతో అతను కుటుంబంతోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, మిగతా మూడు టెస్టులకు కూడా విరాట్ దూరం కానున్నట్టు తెలుస్తోంది. మిగతా సిరీస్‌కు సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించాల్సి ఉంది.