- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Paris Olympics : ఇక కోచ్‌గా ఉండబోను.. తాప్సీ భర్త సంచలన నిర్ణయం
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. కచ్చితంగా పతకం తెస్తుందని భావించిన ఈ జంట అంచనాలను అందుకోలేకపోయింది. ఒలింపిక్స్ నుంచి సాత్విక్ జోడీ నిష్ర్కమణ నేపథ్యంలో భారత పురుషుల డబుల్స్ జట్టుకు కోచ్‌గా ఉన్న మథియాస్ బో కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్‌కు గుడ్ బై చెప్పాడు. మథియాస్ బో శనివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
‘నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇక భారత్‌లోనే కాకుండా ఎక్కడా కోచ్‌గా ఉండను. బ్యాడ్మింటన్ హాల్‌లో చాలా సమయం గడిపా. కోచ్ బాధ్యత చాలా ఒత్తిడితో కూడుకున్నది. నేను అలసిసోయా. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.’ అని రాసుకొచ్చాడు. అలాగే, సాత్విక్, చిరాగ్‌ల ఆటను ప్రశంసించాడు. దేశానికి పతకం అందించాలని ఎంతో కష్టపడ్డారని, అంకిత భావంతో ఆడారని చెప్పాడు. భవిష్యత్తులో ఎంతో సాధిస్తారని ఆకాంక్షించాడు. కాగా, డెన్మార్క్‌కు చెందిన మథియాస్ బో 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రజత పతకం సాధించాడు. మరోవైపు, ఈ ఏడాది నటి తాప్సీ పన్నును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.