Sanju samson : T20ల్లో సంజు శాంసన్ చెత్త రికార్డు..

by Sathputhe Rajesh |
Sanju samson : T20ల్లో సంజు శాంసన్ చెత్త రికార్డు..
X

దిశ, స్పోర్ట్స్ : గత కొన్ని రోజులుగా వైఫల్యాలతో సతమతమవుతున్న టీం ఇండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ టీ20ల్లో బంగ్లాదేశ్, సౌతాఫ్రికాతో వరుసగా రెండు సెంచరీలు చేయడంతో ఇక గాడిన పడినట్లే అని అంతా భావించారు. అయితే సౌతాఫ్రికా సిరీస్‌లో రెండు, మూడో టీ20ల్లో శాంసన్ డకౌట్‌గా నిలిచి చెత్త రికార్డును తన పేరిట నమోదు చేశాడు. వరుసగా రెండు సెంచరీలు, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా శాంసన్ నిలిచాడు. 2024లో మొత్తం ఐదు సార్లు శాంసన్ డకౌట్‌గా నిలిచాడు. దీంతో 2022లో జింబాబ్వేకు చెందిన రెజిస్ చకబ్వా తర్వాత ఒకే ఏడాదిలో ఐదు సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా ఈ వికెట్ కీపర్ నిలిచాడు.

Advertisement

Next Story