IND VS SL : వారు లేకపోవడం టీమిండియాకు నష్టం.. మాకు లాభం : జనత్ జయసూర్య

by Harish |
IND VS SL : వారు లేకపోవడం టీమిండియాకు నష్టం.. మాకు లాభం : జనత్ జయసూర్య
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంక పర్యటనలో వారు వన్డేలు మాత్రమే ఆడనున్నారు. టీ20ల్లో రోహిత్, కోహ్లీ లేకపోవడం భారత్‌కు భారీ నష్టమని శ్రీలంక తాత్కాలిక హెడ్ కోచ్ సనత్ జయసూర్య అభిప్రాయపడ్డాడు. టీ20 సిరీస్‌లో వారి గైర్హాజరును తాము సద్వినియోగం చేసుకుంటామని చెప్పాడు. తాజాగా మీడియాతో జయసూర్య మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్‌లోనే బెస్ట్ ప్లేయర్లు. వారి నైపుణ్యాలు, ఆడిన క్రికెట్‌ అమోఘం. జడేజా కూడా అదే స్థాయి ఆటగాడు. వారు లేకపోవడం భారత జట్టుకు పెద్ద నష్టం. దాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికే చూస్తాం.’ అని చెప్పుకొచ్చాడు. అలాగే, టీమిండియాతో పోరుకు సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సహాయం తీసుకుంటున్నామని చెప్పాడు. రాజస్థాన్ డైరెక్టర్ ఆఫ్ హై పర్ఫామెన్స్ జుబిన్ భారుచా శ్రీలంక బ్యాటర్లు మెరుగవ్వడానికి సహాయపడ్డారని తెలిపాడు. కాగా, మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed