టీమ్ ఇండియా ఐసీసీ టైటిల్స్ విజయాలపై రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్

by Vinod kumar |   ( Updated:2023-03-24 10:07:45.0  )
టీమ్ ఇండియా ఐసీసీ టైటిల్స్ విజయాలపై రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఈ ఏడాది రెండు ఐసీసీ టైటిల్స్ కోసం ఆడుతుండగా.. అందల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కాగా.. మరొకటి వన్డే వరల్డ్ కప్. అయితే ఈ రెండింట్లో టీమ్ ఇండియా గెలిచే అవకాశాలు ఉన్నాయా..? లేదా అనే దానిపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. సచిన్ ఆరు వరల్డ్‌కప్‌లు ఆడితే ఒక్కటి గెలిచాడు అంటూ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ గ్రేట్ లియోనెల్ మెస్సీలనే ఉదాహరణగా తీసుకుని అతడు విశ్లేషించడం విశేషం. సచిన్ ఆరు వరల్డ్ కప్‌లు ఆడితే ఒక్కటి మాత్రమే గెలవగలిగాడని, మెస్సీ కూడా వరల్డ్ కోసం చాలా రోజుల పాటు వేచి చూశాడని ఆయన అన్నాడు. ఏదైనా గొప్ప విజయం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని రవిశాస్త్రి చెప్పాడు.

టీమ్ ఇండియా చివరిసారి 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది. ఈ టోర్నీల్లో సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకూ వస్తున్నా.. చివరి మెట్టుపై బోల్తా పడుతోంది. 2015, 2019 వన్డే వరల్డ్ కప్‌లలో సెమీస్ వరకూ రాగా.. 2014 టీ20 వరల్డ్ కప్‌ల ఫైనల్ చేరగా.. 2016, 2022లో సెమీఫైనల్స్‌లో ఓడిపోయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడినా గెలవలేకపోయింది.

Advertisement

Next Story

Most Viewed