- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజ్‌కోట్ స్టేడియానికి నిరంజన్ షా పేరు
దిశ, స్పోర్ట్స్ : సౌరాష్ట్ర మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెక్రెటరీ నిరంజన్ షాను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్‌సీఏ) సత్కరించింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ స్టేడియానికి ఆయన పేరు పెట్టింది. ఇకపై సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని నిరంజన్ షా స్టేడియంగా పిలువనున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మూడో టెస్టుకు రాజ్‌కోట్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్‌సీఏ స్టేడియం పేరును మార్చింది. కాగా, 79 ఏళ్ల నిరంజన షా 1965-75 మధ్య సౌరాష్ట్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. 12 మ్యాచ్‌ల్లో 281 పరుగులు చేశారు. ఆటకు వీడ్కోలు చెప్పకముందే 1972లో ఎస్‌ఏసీ కార్యదర్శిగా వ్యవహరించారు. మూడు దశాబ్దాలు ఆ పదవిలో ఉన్నారు. అలాగే, నాలుగుసార్లు బీసీసీఐ సెక్రెటరీగా పనిచేశారు. అంతేకాకుండా, గతంలో ఐపీఎల్ వైస్ చైర్మన్‌గా, నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్‌గా ఉన్నారు.
- Tags
- #Rajkot Stadium