- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ టెస్టు రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన చేయగా.. సుదీర్ఘ ఫార్మాట్‌లో వారు కొనసాగడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్‌పై భారత మాజీ ఓపెనర్ క్రిష్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రాణించకపోతే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెపుతాడని అనుకుంటున్నట్టు తెలిపాడు.
తన యూట్యూబ్ చానెల్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ రాణించలేకపోతే భవిష్యత్తు గురించి వంద శాతం ఆలోచించాల్సిందేనని అన్నాడు. ‘ఆ సిరీస్‌లో రోహిత్ శర్మ సత్తాచాటలేకపోతే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనుకుంటున్నా. కేవలం వన్డేలే ఆడతాడు. ఇప్పటికే రోహిత్ టీ20 లకు గుడ్ బై చెప్పాడు. మనం రోహిత్ వయసును దృష్టిలో ఉంచుకోవాలి.’ అని వ్యాఖ్యానించాడు. అలాగే, కెప్టెన్‌గా సిరీస్ ఓటమి బాధ్యతను తనపై వేసుకున్న రోహిత్ గట్స్‌ను శ్రీకాంత్ అభినందించాడు. తప్పును ఒప్పుకోవడం మనిషిలో ఉండాల్సిన గొప్ప క్వాలిటీ అని తెలిపాడు. అలాగే, కోహ్లీ రిటైర్మెంట్‌పై మాట్లాడటం ఇప్పుడు తొందరపాటే అవుతుందన్నాడు. కోహ్లీ ఇంకా చాలా సమయం ఉందని, ఆస్ట్రేలియాలో అతను సత్తాచాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.