కోహ్లీ, రోహిత్ టీ20ల భవితవ్యం తేల్చేది అతనే!

by Vinod kumar |
కోహ్లీ, రోహిత్ టీ20ల భవితవ్యం తేల్చేది అతనే!
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​గా పదవి నుంచి వైదొలగాక చేతన్​ శర్మ స్థానంలో వచ్చే కొత్త సెలక్టరే టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ, టీ20 మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీల క్రికెట్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారని భారత క్రికెట్​ బోర్డులోని ఓ అధికారి తెలిపారు. వీరితో పాటు స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ సహా ఇతర సీనియర్​ ఆటగాళ్ల క్రికెట్​ కెరీర్​కు సంబంధించిన విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారని ఆయన ఓ ప్రముఖ స్పోర్ట్స్​ వెబ్​సైట్​కు వెల్లడించారు. బీసీసీఐ అంతర్గత విషయాలు వెల్లడించి చీఫ్ సెలెక్టర్ పదవి కోల్పోయిన చేతన్ శర్మ స్థానంలో కొత్త సెలెక్టర్‌ను నియమించేందుకు బీసీసీఐ దరఖాస్తులు నిర్వహించింది. ఈ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ దరఖాస్తు చేసుకోగా.. అతనికే చీఫ్ సెలెక్టర్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వయసు పైబడుతుండటంతో ఈ ఇద్దరి టీ20 భవితవ్యంపై అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఇద్దరి టీ20 భవితవ్యంపై కొత్త చీఫ్ సెలెక్టర్ నిర్ణయం తీసుకుంటాడని ఓ అధికారి ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు తెలిపింది. 'భవిష్యత్ ప్రణాళికల గురించి ఆటగాళ్లతో చర్చించడం చీఫ్ సెలెక్టర్ బాధ్యతల్లో ఒకటి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుకు అతీతులు కారు. వాళ్లు కోరుకుంటే సుదీర్ఘ కాలం పాటు జట్టులో ఉండవచ్చు. అయితే ఎంతటి గొప్ప ఆటగాళ్లు అయినా సరే.. సమయం వచ్చినప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. టీమిండియాకు మూడు ఫార్మాట్లు ఆడటంతో పాటు ఐపీఎల్ కూడా ఆడటం అంత సులువైన పని కాదు'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed