Bumrah injury update: బుమ్రా రీ ఎంట్రీపై రోహిత్ క్లారిటీ..

by Vinod kumar |
Bumrah injury update: బుమ్రా రీ ఎంట్రీపై రోహిత్ క్లారిటీ..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పేస్ బౌలర్ బుమ్రా రీ ఎంట్రీపై స్పందించాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్.. గురువారం నుంచి వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్‌కు ముందు ప్రెస్​మీట్‌లో పాల్గొన్న రోహిత్‌ను బుమ్రా రీ ఎంట్రీ గురించి ఓ విలేకరి అడగ్గా.. అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. "టీమ్ఇండియాలో బుమ్రా అనుభవజ్ఞుడైన బౌలర్. అతడు జట్టుకు చాలా కీలకం. ప్రస్తుతం అతడు తీవ్ర గాయం నుంచి కోలుకుంటున్నాడు. కానీ ఐర్లాండ్ పర్యటనకు ఇంకా జట్టును ప్రకటించలేదు.

అతడు ఆ సిరీస్‌లో అడతాడో లేదో నాకు తెలియదు. కానీ అతడు ఆడితే మంచిదే. ఎందుకంటే చాలా కాలం విశ్రాంతి తర్వాత ఏ ఆటగాడైనా.. తొందరగా పాత ఫామ్‌ను అందుకోలేడు. అందుకే బుమ్రా వరల్డ్ కప్​కంటే ముందే జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని అనుకుంటున్నా. కానీ అదంతా అతడు కోలుకునే స్పీడ్​పైనే ఉంటుంది. మేము ఎప్పటికప్పుడు ఎన్‌సీఏతో మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి" అని రోహిత్ శర్మ అన్నాడు.

Advertisement

Next Story