- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజర్ బిన్నీ నేతృత్వంలో ‘డబ్ల్యూపీఎల్’ కమిటీ..
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు మరింత ఆదరణ తీసుకురావాలనే ఉద్దేశంలో భాగంగా బీసీసీఐ గురువారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 8 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ నేతృత్వం వహించనున్నారు. ఈ ప్యానెల్‌కు బిన్నీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండగా, బీసీసీఐ కార్యదర్శి జై షా కన్వీనర్‌గా ఉంటారు. వీరితోపాటు ఈ కమిటీలో అరుణ్ ధుమాల్ (ఐపీఎల్ చైర్‌పర్సన్), రాజీవ్ శుక్లా (బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్), ఆశిష్ షెలార్ (బీసీసీఐ కోశాధికారి), దేవజిత్ సైకియా (బీసీసీఐ సంయుక్త కార్యదర్శి), మధుమతి లేలే, ప్రభతేజ్ భాటియాలు సభ్యులుగా ఎంపికయ్యారు. డబ్ల్యూపీఎల్‌కు మరింత జనాదరణ, పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ కమిటీ వాటాదారులతోపాటు ఆటగాళ్లు, అభిమానులతో కలిసి పనిచేస్తుంది. కాగా, 2024 సీజన్ కోసం ముంబై వేదికగా శనివారం ఆటగాళ్ల వేలంపాట నిర్వహించనున్నారు. వేలంపాట అనంతరం లీగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.