- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిషబ్ పంత్ బ్యాటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
న్యూఢిల్లీ: గతేడాది కారు ప్రమాదం తర్వాత టీమ్ ఇండియా వికెట్ కీపర్ తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టాడు. బ్యాటింగ్ కూడా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది డిసెంబర్‌లో పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహబిలిటేషన్‌లో ఉన్న పంత్ గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ఇటీవలే బీసీసీఐ సైతం పంత్ ఎన్‌సీఏలో బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే.
మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పంత్ పాల్గొన్నాడు. అనంతరం నిర్వహించిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ బ్యాటింగ్ చేశాడు. కారు ప్రమాదం తర్వాత పంత్ బ్యాటు పట్టడం ఇదే తొలిసారి. క్రీజులో పంత్ చాలా సులువుగా కదిలాడు. అలాగే, భారీ షాట్లు కూడా ఆడాడు.
పంత్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పంత్ వేగంగా కోలుకుంటుండటంతో త్వరలోనే తిరిగి జట్టులోకి వస్తాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో అతను తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది.