- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంత్‌కు యాక్సిడెంట్.. మూడు సంవత్సరాల క్రితమే హెచ్చరించిన శిఖర్ ధావన్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజూమున రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుండి రూర్కీ వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో పంత్ డ్రైవింగ్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019 ఐపీఎల్ సీజన్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్, రిషబ్ పంత్ ఢిల్లీ తరుఫున ఆడిన సమయంలో.. సరదాగా వీరిద్దరూ నిర్వహించుకున్న చిట్ చాట్ వీడియో మళ్లీ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో సీనియర్‌గా తనకు ఓ అడ్వైజ్ ఇవ్వాలని పంత్ శిఖర్ ధావన్‌ను అడుగుతాడు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలని ధావన్‌కు పంత్‌కు సూచిస్తాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పంత్ డ్రైవింగ్ స్పీడ్ తెలిసే.. మూడు సంవత్సరాల క్రితమే శిఖర్ ధావన్ హెచ్చరించాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. ఇక, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్.. ఉత్తరఖాండ్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్‌కు మేజర్ గాయాలైనప్పటికీ.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని బీసీసీఐ తెలిపింది. ఇక, రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.