RCB vs KKR : 123 పరుగులకే కుప్పకూలిన RCB

by Prasanna |
RCB vs KKR : 123 పరుగులకే కుప్పకూలిన RCB
X

దిశ, వెబ్ డెస్క్ : ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో KKR రెచ్చిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చిత్తుగా ఓడించింది. ఐపీల్ హిస్టరీలోనే 81 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 205 పరుగుల లక్ష్యంగా దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును. KKR స్పిన్నర్లు వారి బాల్ తో చుక్కలు చూపించారు. ఈ దెబ్బతో సతికిల పడిన RCB 17.4 ఓవర్లలో 123 పరుగులకు అందరూ అవుట్ అయ్యారు . రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే డుప్లెసిస్ (23 పరుగులు ) కోహ్లీ (21 పరుగులు ) , మైకేల్ బ్రెస్ వెల్ (19 పరుగులు ) , డేవిడ్ విల్లే(20 పరుగులు ) చేసారు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. KKR బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో తీసి తన సత్తా చూపాడు. సుయాష్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్ కి రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ హీరో శార్దూల్ కూడా ఓ వికెట్ దక్కించుకున్నాడు.

Advertisement

Next Story