పునరాగమనంలో మ్యాజిక్ స్పిన్‌తో రఫ్ఫాడించిన జడేజా..

by Vinod kumar |   ( Updated:2023-02-09 10:20:35.0  )
పునరాగమనంలో మ్యాజిక్ స్పిన్‌తో రఫ్ఫాడించిన జడేజా..
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది గాయానికి గురై, కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలో సత్తా చాటాడు. నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా తన స్పిన్‌తో ఆసీస్ వెన్ను విరిచాడు. జడేజా 5 వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆసీస్ జట్టులో కీలకమైన వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసి ఆసీస్ పతనంలో తనవంతు పాత్ర పోషించాడు.

లంచ్ తర్వాత మారిన సీన్..

లంచ్ తర్వాత ఆసీస్ జట్టును ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్ జడేజా.. లంచ్ వరకు భారత స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ ఇద్దరినీ జడ్డూ పెవిలియన్ చేర్చాడు. అయితే లంచ్ తర్వాత ఆ సీన్ మారిపోయింది. వ్యక్తిగత స్కోరు 49 వద్ద జడేజా వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు లబుషేన్ ప్రయత్నించాడు. అతను మిస్ అవడంతో బంతి వెనక్కు వెళ్లింది. దాన్ని చటుక్కున అందుకున్న అరంగేట్రం ఆటగాడు కేఎస్ భరత్.. వెంటనే వికెట్లను కూల్చాడు. దీంతో 82 పరుగుల భాగస్వామ్యం విడిపోయింది.

ఆ మరుసటి బంతికే కొత్త బ్యాటర్ రెన్‌షా (0)ను ఎల్బీగా జడేజా అవుట్ చేశాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును ఆదుకునే బాధ్యత స్టీవ్ స్మిత్ (37)పై పడింది. అతను చక్కగానే బ్యాటింగ్ చేశాడు. అయితే జడేజా అతన్ని బోల్తా కొట్టించాడు. అప్పటి వరకు ఆఫ్‌సైడ్ స్పిన్ చేసిన అతను.. సడెన్‌గా స్ట్రెయిట్ డెలివరీ వేశాడు. దాన్ని అంచనా వేయలేకపోయిన స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తను అవుటైన విధానాన్ని అతనే నమ్మలేకపోయాడు. జడ్డూ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో ఆస్ట్రేలియా జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది. జడేజా జడేజా పునరాగమనం లో బౌలింగ్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో 'సర్ జడేజా' అంటూ పోస్టులు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed