Ravichandran Ashwin: అశ్విన్ మరో అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్‌గా..

by Vinod kumar |
Ravichandran Ashwin: అశ్విన్ మరో అరుదైన రికార్డు.. రెండో భారత బౌలర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: బౌలింగ్‌లో ఇప్పటికే ప్రపంచ నెంబర్ వన్‌గా కొనసాగుతున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రెండో వికెట్ సాధించినప్పుడు అశ్విన్ ఖాతాలో 712 వికెట్లు చేరాయి. 711 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్‌‌ను అశ్విన్ వెనక్కి నెట్టాడు.

అనిల్ కుంబ్లే 956 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా కూడా అశ్విన్ నిలిచాడు. విండీస్‌పై కుంబ్లే 74 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 75 వికెట్లు సాధించాడు. కపిల్ దేవ్ 89 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ ఇప్పటి వరకు 94 టెస్టుల్లో 489 వికెట్లు, 113 వన్డేల్లో 151 వికెట్లు 65 టీ20ల్లో 72 వికెట్లు కైవసం చేసుకున్నాడు.

Advertisement

Next Story