Rohit Sharma : రోహిత్ ఓపెనింగ్‌‌‌కు దిగడంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
Rohit Sharma : రోహిత్ ఓపెనింగ్‌‌‌కు దిగడంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, సోర్ట్స్ : బ్రిస్బేన్ టెస్ట్‌లో రోహిత్ ఓపెనింగ్‌కు వస్తే ఆస్ట్రేలియాకు ఫస్ట్ పంచ్ విసిరినట్లే అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ‘రోహిత్ గత పదేళ్లలో ఓపెనింగ్ స్థానంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఓపెనింగే అతని అత్యుత్తమ స్థానం. ఆ స్థానంలో అయితే రోహిత్ జట్టును ముందుండి నడిపించగలడు. ప్రత్యర్థి జట్టుకు భారీ డ్యామేజ్ చేయాలన్నా.. ఆస్ట్రేలియాకు ఫస్ట్ పంచ్ విసరాలన్నా రోహిత్ ఓపెనింగ్‌కు రావాలి. భారత్ ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్ ఫలితాన్ని శాసించవచ్చు. ఈ సిరీస్‌‌ను ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా1-1తో సమయం చేశాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ గెలుస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే భారత్ ఈ మ్యాచ్‌లో పట్టు వదలకుండా ఆడాలి. ఆస్ట్రేలియా అడిలైడ్ విజయంతో పూర్తి విశ్వాసంతో ఉంది. ’ అన్నాడు. రోహిత్ శర్మ రెండో టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు.

Advertisement

Next Story