- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ravi Shastri: ఆ జట్టుతో బీ కేర్‌ఫుల్.. టీమిండియాకు రవిశాస్త్రి వార్నింగ్

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) ఈనెల 19 నుంచి ప్రారంభం కాబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ (Pakistan) హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే భారత్ (India) మ్యాచ్‌లు దుబాయ్ (Dubai) వేదికగా జరగనున్నాయి. భారత్‌తో సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. క్రికెట్ లవర్స్ అంతా ఫిబ్రవరి 23 జరగబోయే దాయాదుల మధ్య పోరును ప్రత్యక్షంగా చూసేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా (Team India)కు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravishastri) వార్నింగ్ ఇచ్చాడు. సొంత గడ్డపై పాక్ జట్టు అత్యంత ప్రమాదకర జట్టని భారత మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అద్భుతమైన పేస్ ఎటాక్ ఆ జట్టు సొంతమని అన్నారు. వరుస మ్యాచ్‌లలో విజయం సాధించి ఆ జట్టు సెమీ ఫైనల్‌కు సునాయసంగా వెళ్లే ఛాన్స్ ఉందని అన్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ (Pakistan) వరుసగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలపై వన్డే సిరీస్ విజయాలు సాధించిన ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెడుతోందని అన్నారు. అదేవిధంగా 8 నెలలుగా వన్డేల్లో ఆ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడారు. మరోవైపు దక్షిణాఫ్రికా (South Africa)లో మంచి ప్రదర్శనలు ఇచ్చిందని గుర్తు చేశారు. పాక్ ఓపెనర్ సయిమ్ అయూబ్ (Saim Ayub) సేవలు అందుబాటులో లేకపోయినా సొంతగడ్డపై పాక్ ప్రమాదకర జట్టేనని అన్నారు. నాకౌట్‌కు అర్హత సాధిస్తే పాక్ మరింత ప్రమాకర జట్టుగా తయారవుతుందని రవిశాస్త్రి జోస్యం చెప్పారు. అయితే, రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాటింగ్ (Ricky Potting) ఏకీభవించాడు. పాక్ ఫాస్ట్ పేస్ విభాగం స్ట్రాంగ్‌గా ఉందన్నారు. ఆ జట్టులో షహీన్ అఫ్రిది (Shaheen Afridi), నసీమ్ షా (Naseem Shah) లాంటి టెక్నిక్ ఉన్న బౌలర్లు ఉన్నారని.. వారు ఏ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను అయినా కూల్చేయగలరని కామెంట్ చేశారు.