- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రవి బిష్ణోయ్‌కి చిన్నప్పటి నుంచే ఆ అలవాటు.. ఎంత ట్రై చేసినా మార్చుకోలేకపోతున్నాడట
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్లతో నెగ్గి సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం రవి బిష్ణోయ్‌తో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోమవారం సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియో సరదాగా సాగగా.. రవి బిష్ణోయ్ గురించి అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
అతనికి ఆతృతగా ఎక్కువని, ప్రతి విషయంలోనూ హడావిడిగా ఉంటాడని రివీల్ చేశాడు. ‘బిష్ణోయ్ గురించి ఒక్క విషయం చెప్పాలంటే.. ఎప్పుడూ హడావిడిగా ఉంటాడు. తన లంచ్‌ను త్వరగా తింటాడు. తిన్న వెంటనే హడావిడిగా తన రూంకి వెళ్లిపోతాడు. హడావిడిగా ఉంటాడు కాబట్టే.. మూడు వికెట్లు కూడా త్వరగా తీశాడు.’అని చెప్పాడు. అనంతరం రవి బిష్ణోయ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు ఆ అలవాటు ఉందని చెప్పాడు. ‘నా బౌలింగ్ రన్ అప్ కూడా వేగంగా ఉంటుంది. నాకు త్వరగా ఆకలి అవుతుంది. ఆహారాన్ని కూడా త్వరగానే తింటాను. ఆ అలవాటును మార్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా. కానీ, సాధ్యపడటం లేదు.’ అని చెప్పుకొచ్చాడు.