- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Ranji Trophy : ఎదురులేని ముంబై.. ఫైనల్‌లో విదర్భను చిత్తు చేసి 42వ సారి టైటిల్ కైవసం
దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ముంబై జట్టు మరోసారి తనకు ఎదురులేదని నిరూపించింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో టైటిల్స్ గెలిచిన ఆ జట్టు 42వసారి ట్రోఫీ సొంతం చేసుకుంది. అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచింది. ముంబై వేదికగా విదర్భతో జరిగిన ఫైనల్‌లో గురువారం169 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విదర్భ పోరాడినా ఫలితం దక్కలేదు. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో ఐదో రోజు ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు 120 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.
ఓవర్‌నైట్ బ్యాటర్లలో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్(102) సెంచరీ పూర్తి చేయగా.. హర్ష్ దూబే(65) సత్తాచాటాడు. వీరి పోరాటంతో విదర్భ 353/5 స్కోరుతో నిలిచి విజయావకాశాలను పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో ముంబై బౌలర్లు పుంజుకుని ప్రత్యర్థికి చెక్ పెట్టారు. కేవలం 15 పరుగుల వ్యవధిలోనే విదర్భ ఐదు వికెట్లను కోల్పోయింది. అక్షయ్, హర్ష్ దూబే వరుస ఓవర్లలో అవుటయ్యారు. 6 వికెట్‌కు ఈ జోడీ 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. టెయిలెండర్లు ఆదిత్య సర్వతే(3), యశ్ ఠాకూర్(6), ఉమేశ్ యాదవ్(6) పోరాడలేకపోయారు. ముంబై బౌలర్లలో తనూష్ 4 వికెట్లతో సత్తాచాటగా.. తుషార్ దేశ్‌పాండే, ముషీర్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చివరిసారిగా 2016లో చాంపియన్‌గా నిలిచిన ముంబై 8 ఏళ్ల తర్వాత తిరిగి చాంపియన్ హోదా సాధించింది. మరోవైపు, మూడోసారి టైటిల్ గెలవాలన్న విదర్భ ఆశలు ఫలించలేదు. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలువగా.. తనూష్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.