- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్ర, ఉత్తరప్రదేశ్ మ్యాచ్ డ్రా
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపు-బిలో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు డ్రాగా ముగించింది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 271/5తో ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు 429/9 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ వీరుడు రిక్కీ భుయ్(129) నాలుగో రోజు ఆరంభంలోనే పెవిలియన్ చేరగా.. షేక్ రషీద్(85), నితిశ్ రెడ్డి(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మూడో సెషన్‌లో డిక్లేర్డ్ ప్రకటించిన ఆంధ్ర జట్టు 492 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆటలో చివరి రోజు కావడం, ఉత్తర ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించేందుకు సమయం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 261 పరుగులు చేయగా.. ఉత్తరప్రదేశ్ 198 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఆంధ్ర జట్టుకు 3 పాయింట్లు లభించగా.. ఉత్తరప్రదేశ్‌కు ఒక్క పాయింట్ మాత్రమే దక్కింది. దీంతో గ్రూపు-బిలో 25 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆంధ్ర జట్టుకు క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ ఖాయమే. ఈ నెల 16 నుంచి 19 వరకు విజయనగరం వేదికగా జరిగే చివరి గ్రూపు మ్యాచ్‌లో కేరళతో ఆంధ్ర టీమ్ తలపడనుంది.
- Tags
- #Ranji Trophy