- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిజోరంపై రెచ్చిపోయిన హైదరాబాద్ బ్యాటర్లు
దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో వరుసగా ఐదో విజయంపై కన్నేసిన హైదరాబాద్ ప్లేట్ గ్రూపులో మిజోరంతో జరుగుతున్న చివరి గ్రూపు మ్యాచ్‌లో ఆధిపత్యం చాటుతున్నది. శనివారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లను కోల్పోయి 458 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 120/1తో రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ 500 స్కోరు దిశగా వెళ్తున్నది. ఓవర్‌నైట్ బ్యాటర్ రాహుల్ సింగ్(108) సెంచరీ పూర్తి చేయగా.. రోహిత్ రాయుడు(60) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు కీలక ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ రెడ్డి(115) రంజీ ట్రోపీలో తొలి శతకాన్ని నమోదు చేశాడు. సత్తాచాటిన మరో బ్యాటర్ ప్రగ్నయ్ రెడ్డి(91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. లంచ్ తర్వాత మిజోరం బౌలర్లు పుంజుకుని కీలక వికెట్లు పడగొట్టారు. కార్తికేయ(36 బ్యాటింగ్), సాంకేత్(2 బ్యాటింగ్) ఆచితూచి రెండో రోజు ముగించారు. మిజోరం బౌలర్లలో మోహిత్, కేసీ కరియప్ప మూడేసి వికెట్లతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో మిజోరం 199 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ 259 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. నేడు తొలి సెషన్‌లోనే హైదరాబాద్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ ఇచ్చి.. మిగతా రెండు సెషన్లలో మిజోరం ఆలౌట్ చేస్తే ఆదివారమే హైదరాబాద్ విజయం లాంఛనం కావొచ్చు.